26-07-2025 12:00:00 AM
రైతు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మెన్ కోదండరెడ్డికి వినతిపత్రం
అయిజ జూలై 25 : అలంపూర్ నియోజకవర్గం తరువాత అతి పెద్ద వ్యవసాయ మండలంగా గల అయిజ పట్టణంలో నూతన వ్యవసాయ మా ర్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయాలనీ కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లో రైతు సంక్షేమ శాఖ కార్పొరేషన్ చై ర్మెన్ కోదండరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారిలు వినతిపత్రం ను అందచేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడు తు అలంపూర్ మార్కెట్ యార్డ్ నూతన సభ్యల ప్రమాణ స్వీకారం రోజున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర్ రావు సైతం అయిజ పట్టణం లో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అందుకు సంబందించి నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటు కు కృషి చేయాలనీ వారు కొరారు.