ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని కిస్టాపూర్ పూడూరు డివిజన్ పరిధిలో గల కేఎల్ఆర్ కమాన్ వద్ద ఆచార్య డాక్టర్ జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిషలు శ్రమించిన మహానీయులు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ ను ఎన్నటికీ మరువలేమని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు ముదిరాజ్ (చాపరాజు) చెప్పారు. ఎల్లంపేట్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఆచార్య డాక్టర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మేడ్చల్ లో జరిగిన కార్యక్రమంలో జయశంకర్ సార్ విగ్రహా ప్రతిష్ఠ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, కిస్టాపూర్ పూడూరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధి ఉదండపురం సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు దుర్గం శివ శంకర్ ముదిరాజ్, రేగు రాజు, మేడ్చల్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజి అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజి వైస్ చైర్మన్ చీర్ల రమేష్,మాజి కౌన్సిలర్ లు జాకట దేవరాజు, కౌడే మహేష్ కురుమ, బిల్ కలెక్టర్ లు పాల్గొన్నారు.






