ఏఐకేఎంఎస్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలి: మామిడాల భిక్షపతి
06-08-2026 08:36 PM
ఆలేరు,(విజయక్రాంతి): సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాలలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి పిలుపునిచ్చారు. ఆలేరులో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు, కౌలు రైతులకు గుర్తింపు, వ్యవసాయ కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి, కనీస వేతనాల అమలు, భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ వాణిజ్య ఒప్పందాలు దేశీయ వ్యవసాయానికి నష్టమని, వాటిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.






