6 August, 2026 | 8:37 PM

Breaking News

ఏఐకేఎంఎస్ రాష్ట్ర 9వ మహాసభలను జయప్రదం చేయాలి: మామిడాల భిక్షపతి   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ధర్మరావుపేట విద్యార్థి ఎంపిక   •   వారాంతపు సంతను ప్రారంభించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత   •   ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించిన బోధన్ స్వర్ణకార సంఘం   •   నిజాయితీ, నిరాడంబర జీవనానికి ఆదర్శం ప్రొఫెసర్ జయశంకర్   •   నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి   •   అనుమతి లేకుండా కమ్యూనిటీ హాల్ కూల్చివేత   •   జగ్గయ్యపల్లి ఉపాధి హామీ(వీబీజీ రాంజీ) ఆర్ధిక, అక్రమాలపై ఫిర్యాదులు   •   కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలి   •  

రైతులకు యూరియా కోసం ఇబ్బందులు కలిగిస్తున్న ప్రభుత్వం

06-08-2026 07:18 PM

చిట్యాల,(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ కోసం యాప్‌ను ప్రవేశపెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని గురువారం  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చిట్యాల మండల ఇన్‌చార్జి శాగ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ అధ్యక్షతన ఉరుమడ్ల గ్రామంలో మండల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, చిట్యాల మండల ఇన్‌చార్జి శాగ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీ కోసం యాప్‌ను ప్రవేశపెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మరో జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు (ఎంపీటీసీ, జడ్పీటీసీ) దృష్ట్యా పార్టీ కార్యకర్తలంతా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. అంతర్గత విభేదాలకు తావు ఇవ్వకుండా పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.