19-07-2025 01:37:57 AM
ప్రారంభించిన- కరస్పాండెంట్ రవి మారుతి
ఖమ్మం, జూలై 18 (విజయక్రాంతి): విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందు కు హార్వెస్ట్ క్రీడా ప్రాంగణంలో రూ.10 లక్షల వ్యయంతో బాస్కెట్‌బాల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు హార్వెస్ట్ గ్రూప్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి రవి మారుతి, ప్రిన్సిపల్ ఆర్ పార్వతిరెడ్డి శుక్రవారం తెలిపారు.
విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ క్రీడలతోపాటు బాస్కెట్‌బాల్, నెట్ బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో తమ పాఠశాల ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ కోర్టును ఏర్పాటు చేసి ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.