calender_icon.png 29 July, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కమిటీ సభ్యులు

29-07-2025 01:21:00 AM

బూర్గంపాడు,జూలై28,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను సోమవా రం ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు పరిశీలించారు. బూర్గంపాడులోని అంబేద్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇ ళ్ళను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేసిందని వారు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలు ఎవరైనా ఉంటే డ్వాక్రా సంఘాల ద్వారా లక్ష రూపాయల వరకు సహాయం తీసుకొని ఇండ్ల ని ర్మాణాలను నిర్మించుకోవచ్చన్నారు. ప్రజాపాలన కొనసాగిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల పక్షాన పేదలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి ప నులను చేపడుతుందని వారు అన్నారు. ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ఈ ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యు లు కైపు వరమ్మ, భజన సతీష్, కేసుపాక మ హేష్, బర్ల నాగమణి, ఎస్. కె. ఛోటే, కాం గ్రెస్ పార్టీ నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి, జి ప్రవీణ్ కుమా ర్, 228 బూత్ కన్వీనర్ అలవాల దుర్గా ప్రసాద్, కో కన్వీనర్ నందిపాటి వెంకటేశ్వర్లు, కేసుపాక రాజేష్, తోకల వెంకటరమణ, కళావతి, గొడ్ల వెంకటేశ్వర్లు, మ ల్లేష్, వెంకటనారాయణ పాల్గొన్నారు.