ముగ్గురు అధికారులతో పీఆర్సీపై కమిటీ
29-04-2026 01:53 AM
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై ప్రభుత్వం ముగ్గురు అధికా రులతో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఏవో కే.గీత, డిప్యూటీ సీటీఎం సమీరా అఫ్రీన్, డిప్యూటీ సీపీఎం వై.శిరీష ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పేస్కేల్‌కు సంబంధించి ఓ నివేదికను రూపొందించి మే 10 వరకు ఇవ్వాలని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యలో 11 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.






