29 April, 2026 | 3:25 AM

బీఆర్‌ఎస్ కమిటీల రద్దు కాదు..ప్రజలే ఆ పార్టీని రద్దు చేశారు

29-04-2026 01:54 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 28(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ తమ కమిటీలను రద్దు చేసుకోవడం రాజకీ య వైఫల్యానికి నిదర్శనమని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. కుటుంబ పాలనను కొనసాగించాలనే ఆరాటంతో మాజీ సీఎం కేసీఆర్ ప్రజల ఆశయాలను విస్మరించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ రాజకీయాలకు వేదికగా మార్చిన బీఆర్‌ఎస్‌ను ప్రజలే ఇప్పటికే గట్టి తీర్పు ఇచ్చారని, అందుకే ఆ పార్టీని ప్రజలు రాజకీయంగా తిరస్కరించారని సాయికుమార్ పేర్కొన్నారు.

కేసీఆర్ పాలన ఇప్పుడు గతమైందని, తెలంగాణ భవిష్యత్తు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి ప్రస్తుత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారని, ఆ మార్పుకు ప్రతీకగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలుస్తోందని సాయికుమార్ అన్నారు.