6 August, 2026 | 2:59 AM

రేణ్యా తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

06-08-2026 02:02 AM

మహబూబాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని కొత్తగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణ్యాతండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 ఇళ్లను, పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 వాహనాలను గుర్తించారు. అదేవిధంగా అక్రమంగా నిల్వ ఉంచిన 32 లీటర్ల గుడుంబా, 120 కిలోల బెల్లం (బ్లాక్ జాగరీ) స్వాధీనం చేసుకుని, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి నిందితులపై చట్టపరమైన కేసులు నమోదు చేయనున్నట్లు గూడూరు సీఐ వినయ్ తెలిపారు.