6 August, 2026 | 2:38 AM

మిడ్ మానేరుకు జలకళ

06-08-2026 02:01 AM

నేడు ఎల్‌ఎండీకీ నీటి విడుదల

బోయినపల్లి: ఆగస్టు 5(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయం కు ఎల్లంపల్లి నుండి గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఇన్ఫ్లో కొనసాగుతుంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయం పది రోజుల క్రితం వరకు నీటి నిలువలేక వెలవెలబోయింది. వరుణ దేవుడు కరుణించడంతో వారం రోజుల క్రితం నుంచి వర్షాలు పడుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా నిండి దిగువన ఉన్న ప్రాజెక్టులకు వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

gజలాశయం 27.55 టీఎంసీల సామర్థ్యానికి గాను 16 టీఎంసీల కు చేరుకుంది.మిడ్ మానేర్ రిజర్వాయర్‌ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎంఎంఆర్ రేడియల్ గేట్ల నుండి గురువారం ఉదయం 9:00 గంటలకు దిగువకు ఎల్ ఎం డి రిజర్వాయర్ కు *త్రాగునీరు కోసం 2000 క్యూ సెక్కుల నీటిని విదుదల చేయనున్నారు  దిగువ గ్రామాలకు సంబంధించిన పోలీసు, రెవెన్యూ అధికారులు ,ప్రజాప్రతినిధులు, గ్రామస్తులను అప్రమత్తం చేయాలని సూచించారు.నదిలో ఉన్న మోటార్లను వీలైనంత త్వరగా తొలగించాలని, పశువులను నది దగ్గరకు రాకుండా చూడాలని కోరారు.