calender_icon.png 3 November, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి

03-11-2025 12:46:03 AM

నాగర్కర్నూల్, నవంబర్ 2 (విజయక్రాంతి):మొంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోయారని ప్రభుత్వం ఎకరానికి 50 వేల పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని బోయపూర్ గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు.

రైతులు ఎకరానికి 40వేల వరకు ఖర్చు పెట్టి పంటలు నష్టపోయారని, అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు.మండల కార్యదర్శి హనుమంతు, నాయకులు రమేష్, వెంకటయ్యపాల్గొన్నారు.