03-11-2025 11:29:33 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం(Chevella road accident) మీర్జా గూడ వద్ద సోమవారం తెల్లవారుజామున వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation) బస్సు సుమారు 72 మంది ప్రయాణికులతో వెళుతుండగా, క్రషర్ కాంక్రీటుతో నిండిన టిప్పర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో కనీసం 19మంది మరణించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ''తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందిస్తాం.'' అంటూ ప్రధానమంత్రి ఎక్స్ పీఎంఓలో పోస్టు చేశారు.