calender_icon.png 3 November, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత.. చేవెళ్ల ఎమ్మెల్యేకు నిరసన సెగ

03-11-2025 10:53:20 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) చేవెళ్ల మండలం(Chevella Road Accidentమీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బస్సు ప్రమాదస్థలం వద్ద స్థానికులు ఆందోళనకు చేస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA) కాలె యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో యాదయ్యకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే యాదయ్యపై(Congress MLA Kale Yadaiahప్రజలు రాళ్లతో దాడికి యత్నించారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొన్నేళ్లుగా రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు ఆలస్యం చేశారని ఆగ్రహించిన స్థానికులు నిత్యం ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలో పోలీసులతో స్థానికుల వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన  తాండూర్ బస్సును ఇక్కడ నుండి తొలగించవద్దని ప్రజలు ఫైర్ అయ్యారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో పోలీసులు ఎమ్మెల్యే కాలే యాదయ్య అక్కడనుంచి పంపించేశారు.

చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. సోమవారం ఉదయం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై(Hyderabad-Bijapur National Highway) రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలోని మీర్జాగూడ గ్రామం సమీపంలో తాండూర్ డిపోకు చెందిన టీఎస్ 34 టీఏ 6354 నంబర్ గల టీజీఎస్ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. టన్నుల కొద్దీ కంకర చెల్లాచెదురుగా పడి, అనేక మంది ప్రయాణికులు లోపల చిక్కుకుని మరణించారు. పోలీసులు,  రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, శిథిలాలను తొలగించి ప్రాణాలతో బయటపడిన వారిని బయటకు తీయడానికి మూడు జేసీబీలను ఉపయోగించి భారీ సహాయక చర్యలను ప్రారంభించాయి.