03-11-2025 11:14:53 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy road accident) చేవెళ్ల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతులకు ఉస్మానియా ఆస్పత్రిలో(Osmania Hospital) పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు. ఐదు బృందాలతో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సును కంకర లారీ ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్ సహా 19 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. చేవెళ్ల సర్కార్ ఆస్పత్రిలో 10 మందికి, మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిలో10 చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు.