calender_icon.png 3 November, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

03-11-2025 08:36:30 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో(Rangareddy district) సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో(Road Accident ) బస్సు, లారీ డ్రైవర్లు సహా 19 మంది మృతి చెందారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి(Chevella Government Hospital) తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో హృదయవిదారకర వాతావరణం నెలకొంది. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై(Hyderabad-Bijapur National Highway) తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లున్న బస్సును కంకర లారీ ఢీ కొట్టింది. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. లారీలో ఉన్న కంకర పడడంతో ప్రయాణికులు బస్సులో కూరుకుపోయారు. మూడు జేసీబీల సహాయంతో సహయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో బస్సుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంతో చేవెళ్ల - వికారాబాద్ మార్గంలో(Chevella - Vikarabad route) భారీ ట్రాఫిక్ జామ్ అయింది. టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో తాండూరు డిపోకు చెందిన బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.