27-10-2025 12:00:00 AM
అలంపూర్ అక్టోబర్ 26; ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఈనెల 24న జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం మృతిచెందిన కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.
ఈ మేరకు ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్డీవో అలివేలి ఆదివారం క ర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన మృతుల వివరాలు..చందన మంగ, సంధ్యారాణి,మేఘనాథ్ అనూష,గిరిరావు,కేనుగు దీపక్ కుమార్ మృతి చెందినట్లు తెలిపారు వారి కుటుంబ సభ్యులకు అట్టి చెక్కులను అందజేశారు.కార్యక్రమంలో డిపిఓ నాగేం ద్రం,ఆయా మండలాల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.