calender_icon.png 27 October, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు పోరాటానికైనా సిద్ధం

27-10-2025 12:00:00 AM

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్

కొల్లాపూర్ రూరల్, అక్టోబర్ 26:జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, గృహనిర్మాణం వంటి సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని టీయూడబ్ల్యూజేఐజేయూ రా ష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. ఆదివారం పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామంలో టీ యూడబ్ల్యూజేఐజేయూ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యుల సమావేశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్కుమార్, ఆర్.సురేష్ కుమార్ ఆ ధ్వర్యంలో జరిగింది.

ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జి.మధు గౌడ్, అతిథులుగా నూతనంగా నియమితులైన ఉమ్మడి జిల్లా జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు గౌడ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల హెల్త్కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల జారీ అంశాల్లో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల కృషితో ప్రభుత్వం చర్చలు జరిపింద ని, త్వరలోనే మంచి వార్త లభించనున్నదన్నారు.జిల్లా కార్యవర్గ సమావేశంలో నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వహణపై చర్చించగా, జిల్లా కౌన్సిల్ సభ్యులు రాజశేఖర్ పాల్గొన్న వారికి ధన్యవాదాలుతెలిపారు.