27-01-2026 08:22:38 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని బారెగూడ గ్రామానికి చెందిన ప్రజలు, నాయకులు డిఆర్డిఓ దత్తరావుకు ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించాలని ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024,-2025 సంవత్సరం గాను చేసిన పనులపై సామాజిక తనిఖీ బృందం బారే గూడ గ్రామంలో ఈనెల 22వ తేదీన 14వ విడత సామాజిక తనిఖీ బృందం గ్రామంలో పల్లె రవికుమార్ ఇంటికి వెళ్లి పది రోజులు పనిచేశారా అని అతన్ని అడగగా ఉపాధి హామీ పనికి వెళ్లలేదని తెలిపాడు.
దీనితో అతను తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశాడు. 23వ తేదీన గ్రామసభ నిర్వహించారు. తనిఖీ బృందం ఫీల్డ్ అసిస్టెంట్ ఎలాంటి రిజిస్టర్స్ మెయింటెనెన్స్ లేవని తెలిపారు. గ్రామ సర్పంచ్ తేలి సుశీల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఎంతమంది వెళ్లారు వారి వివరాలు తెలుపాలని సభ ముఖంగా అడగగా చదివి వినిపించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబ సభ్యులే 12 మందికి పనికి వెళ్లకుండా 329 కూలీలకు గాను 73,893 రూపాయలు అతని కుటుంబ సభ్యులు బంధువులు ఏలాంటి పనులు చేయకుండానే డబ్బులు తీసుకున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. అవినీతికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ మాకు వద్దని డిఆర్డిఓ కు తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించకపోతే గ్రామంలోని కూలీలు పనులకు వెళ్లారని వారు తెలిపారు.