27-01-2026 08:25:58 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల రద్దీ సమయంలో భక్తులకు సులభతరంగా దర్శనం ప్రసాదాలు లభించేలా మార్పులు చేర్పులు చేపట్టేందుకు దేవస్థానం ఈవో కే.దామోదర్ రావు పలు చర్యలు చేపట్టారు. మంగళవారం ఆయన తమ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో మార్పులు చేర్పులు చేపట్టేందుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు.
ప్రధానంగా వారాంతపు సెలవులలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ప్రసాదాల కౌంటర్లు, ఉచిత క్యూలైన్లలో మార్పులు చేసేందుకు ప్రాథమిక పరిశీలన నిర్వహించారు. ఈ సమయంలో ఆయన వెంట దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ వి రవీంద్రనాథ్, ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.