28 August, 2026 | 2:11 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ప్రభుత్వ భూమి కబ్జాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

09-07-2026 01:44 AM

తక్షణ చర్యలకు ఆదేశం

హుస్నాబాద్, జూలై 8 : అక్కన్నపేట స్మశాన వాటికకు సంబంధించిన ప్రభుత్వ భూమి 4 ఎకరాలు కబ్జాకు గురైన విషయంపై గ్రామ ప్రజాప్రతినిధులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కు బుధవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వెంటనే హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తిని సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు ఆర్డీవో రామ్మూర్తిని కలిసి సమస్యను వివరించగా, తక్షణమే స్పందించిన ఆయన స్వల్ప వ్యవధిలోనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అక్కన్నపేట మాజీ ఎంపీటీసీలు పెసరు సాంబరాజు మాట్లాడుతూ.. అక్కన్నపేట రెవెన్యూ శివారులోని ప్రభుత్వ భూములను భవిష్యత్ అవసరాలు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఉపయోగపడేలా కాపాడాల్సిన అవసరం ఉందని అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ తమ సామాజిక బాధ్యతగా భావించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఆర్డీవో హామీ ఇచ్చారన్నారు.ఇందులో కందుల రామ్రెడ్డి, మాజీ సర్పంచ్ కాశబోయిన ఎల్లయ్య, గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మల్లేశం, 9వ వార్డు సభ్యులు పెసరు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.