15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పోలీస్ ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

02-12-2025 02:14 AM

 ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, డిసెంబర్ 1 (విజయ క్రాంతి):నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే పోలీస్ ప్రజావాణి కార్యక్రమం గ్రామీణ ప్రజల ఆదరణ పొందుతోంది ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్.సాయి చైతన్య, ప్రజల సమస్యలను తెలుసు కొని వారి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు తమ సిబ్బందికి ఆదేశాలిస్తున్నారు.

సోమవారం రోజు జరిగిన ఈ కార్యక్రమంలో*ప్రజల వద్ద నుండి వివిధ ఫిర్యాదు లకు సంబందించిన 11 ఫిర్యాదు లను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. 

సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకొని పరిష్కారానికి సూచనలు తమ సిబ్బందికి చేశారు.

తమ సమస్యల పట్ల ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని *పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.