calender_icon.png 2 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ లీకేజీకి మరమ్మతులు

02-12-2025 02:13:40 AM

నంగునూరు, డిసెంబర్ 1: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్లో ఏర్పడిన లీకేజీలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేశారు. విజయక్రాంతి భగీరథ జలాధార...’ శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.

రెండు చోట్ల లీకేజీలు ఏర్పడి వేలాది లీటర్ల నీరు వృథాగా పోతోందన్న ఆ కథనం నేపథ్యంలో సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, తక్షణమే పనులు చేపట్టి, పైప్లైన్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిగా మరమ్మతులు చేశారు. దీంతో లీకేజీ ద్వారా నీరు వృథా కావడం ఆగిపోయింది. దీనిపై గ్రామస్తులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వార్తా కథనాన్ని ప్రచురించిన విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.