01-09-2025 07:21:20 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(TJAC) పిలుపుమేరకు సోమవారం రోజున శాతవాహన విశ్వవిద్యాలయం బోధనేతర ఉద్యోగుల సంఘం పాత పెన్షన్ సాధన ధర్నా కార్యక్రమం విశ్వవిద్యాలయాల పరిపాలన భవనం ఎదుట నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ బిక్షం కాదని ఉద్యోగుల హక్కు అని నినాదాలు చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వై కిషోర్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సూపరిండెంట్ భీమయ్య, రాజేశ్వరి, సంతోష్, యోజన, మాధురి, కిషన్, పసివుద్దీన్, నర్సయ్య పాల్గొన్నారు.