calender_icon.png 19 July, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమర్థవంతంగా పూర్తి చేయండి

19-07-2025 12:00:00 AM

- అధికారులతో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ జూలై 18 (విజయ క్రాంతి) : అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వి.సి.కాన్ఫరెన్స్ హాల్ లోరెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికారడ్స్, సంబంధిత అధి కారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి రెవె న్యూ,ఇరిగేషన్ భూ సేకరణ సంబంధించి రికార్డులను వెరిఫై చేసి సమగ్రమైన నివేదికలతో వచ్చే సమావేశానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ ఎంతవరకు వచ్చిందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కు కావలసిన స్థలాన్ని పెగ్ మార్క్కింగ్ చేస్తూ సబ్ డివిజన్ సర్వే సర్వేయర్ల ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని అందుకు మిడ్జిల్ తహ సిల్దార్ సహకరించాలని అన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు నివేదికలను సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎ.నరసింహా రెడ్డి, ఆర్డీవో నవీన్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, సర్వే లాండ్ రికార్డు ఏ.డి.కిషన్ రావు, దేవరకద్ర, సి.సి.కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ తహసిల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.