19-07-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు
ఎల్లారెడ్డి, జూలై 18 (విజయ క్రాంతి): గత పది సంవత్సరాలుగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా పేదలకు పంపిణీ చేయలేదని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి, పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, మండలాలకు చెందిన, అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మె ల్యే, మదన్మోహన్ మాట్లాడుతూ.. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలెవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఆర్డిఓ పార్థ సింహారెడ్డి, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, నాగిరెడ్డి పేట మండల తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసిలు ఉషా గౌడ్, సామెల్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి మాజీ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు సాయిలు, నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.