calender_icon.png 27 October, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్రుని కుటుంబానికి అండగా రూ. లక్ష సాయం

27-10-2025 12:00:00 AM

సంస్థాన్ నారాయణపూర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలంలో 1994- 95 వ సంవత్సరంలో  పదవతరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమతో కలిసి చదువుకొని అనారోగ్యంతో మరణించిన సాటి మిత్రుని కుటుంబానికి అండగా నిలబడి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు.

నారాయణపురం మండలానికి చెందిన స్నేహబంధం టీం చిన్న నాటి మిత్రుడు రాపోలు రాజేష్ అనారోగ్యంతో మరణించాడు. ఆదివారం  మిత్రులందరు కలిసి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు.స్నేహితులంతా కలిసి ఒకలక్ష నాలుగు వేల రూపాయలు జమ చేసి రాజేష్ కూతురు మన్యశ్రీ పేరుపై ఫిక్స్ డిపాజిట్ చేశారు.

డిపాజిట్ పాస్ బుక్ కుటుంబ సభ్యులకు అందజేశారు.తమ తోటి స్నేహితుని కుటుంబానికి ఆపదలో ఆదుకున్న స్నేహితులను గ్రామస్తులంతా అభినందించారు. ఈ కార్యక్రమంలో పున్నoయాదగిరి, పొట్ట సత్తయ్య గౌడ్, సురుకంటి రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వందనపు నాగేష్, బద్దుల మల్లేష్ యాదవ్, వీరమల్ల అంజయ్య గౌడ్, పిన్నింటి రామిరెడ్డి, పోలోజు వెంకటాచారి, ఈదులకంటి కైలాసం గౌడ్, కొండ్రు మహేష్, సురపల్లి శ్రీనివాస్, శానాజ్ బేగం తదితర మిత్రులు పాల్గొన్నారు.