16 August, 2026 | 1:14 AM

కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి

16-08-2026 12:00 AM

ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వీహెచ్

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): కుల గణనతోనే బీసీలకు సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ధి ప్రత్యేక సలహాదారు వి హనుమంత రావు అన్నారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడి యాతో ఆయన మాట్లాడారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వా మ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.

ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమా రాణి శ్రీనివాస్, పండ్ల రాజు, గోనె శ్రీనివాస్, కామారెడ్డి విండో చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, సాయిలు, చాట్ల రాజేశ్వర్ ఉన్నారు.