06-12-2024 01:42:35 AM
కీలకంగా ఐటీ, పారిశ్రామిక కంపెనీల ఏర్పాటు
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధితో దూసుకుపోతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖల వార్షిక నివేదికపై గురువారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో ఐటీ, పారిశ్రామిక కంపెనీల ఏర్పాటు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏడాది కాలంలోనే అద్భుత ప్రగతిని సాధించి ముందుకు సాగుతుందన్నారు. ఐటీ రంగంలో అనేక గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను ఆకర్షించామని తెలిపారు. ఫెడెక్స్, జెడ్‌ఎఫ్‌టెక్, మారియట్ వంటి సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని పేర్కొన్నారు.
లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్, కాగ్నిజెంట్, ఆర్సెసీఎం, ఊబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి కంపెనీలు తమ కంపెనీలను మరింత విస్తరించారని వెల్లడిం చారు. టీ-హబ్ ద్వారా 291 మిలియన్ డాలర్ల ఫండ్‌ను రైజ్ చేసినట్టు తెలిపారు. తెలంగాణ యువతకు స్టార్టప్ ఆవిష్కరణకు సహకారం అందించడంలో భాగంగా ఇన్నోవేట్ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు.
టీ-బ్రిడ్జ్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు 12 దేశాలతో ఎంవోయూ చేసుకున్నామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వింగ్ ద్వారా రూ.6 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్శించామని, దీని ద్వారా 5,200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
ఫిబ్రవరిలోపు అమర్‌రాజా శంకుస్థాపన
అమర్‌రాజా స్కిల్ డెవలప్‌మెంట్ ఫిబ్రవరిలోపు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌కు సంబంధించి గత మా ప్రభుత్వంలో గీతారెడ్డి ప్రతిపాదన చేశారని, కానీ గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలే దని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర పారిశ్రామికశాఖ మంత్రి పీయూష్ గోయల్ చొరవతో త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. రూ.2,500 కోట్లతో పారిశ్రా మిక తయారీ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నామ ని, దీంతో 2 లక్షల మందికి ఉపాధి అందించనున్నామని పేర్కొన్నారు. ఏఐ సమ్మిట్‌లో భాగంగా 20 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
అన్ని రంగాల్లో ఏఐని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీకి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. మన మానవ వనరులను, నైపుణ్యాన్ని మనమే ఉపయోగించుకునే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా మిత్ర యాప్‌ను 8వ తేదీన సీఎం రేవంత్ ప్రారంభించనున్నారని చెప్పారు.
టాస్క్ ద్వారా పదివేలకుపైగా విద్యార్థులకు ఈ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే వారధిగా పనిచేసేందుకు డీట్‌ను అందుబాటు లోకి తీసుకొచ్చామని స్పష్టంచేశారు.
నైపుణ్యాభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీ
తెలంగాణ యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు స్కిల్ వర్సిటీని ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే నాలుగు రంగాల్లో కోర్సులను ప్రవేశపెట్టామని, ఇటీవల పెద్దపల్లి సభలో మరో 7 స్కూళ్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. వీటిలో స్కూల్ ఎంటర్‌ప్రెన్యూరిషిప్, స్కూల్ ఆఫ్ ఏవియేషన్, స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్, స్కూల్ ఆఫ్ హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్, స్కూల్ ఆఫ్ స్కూల్ ఆఫ్ మీడి యా, ఎంటర్‌టైన్‌మెంట్ వంటివి ఉన్నాయని తెలిపారు.
దీంతోపాటు రెడింగ్‌టన్ ఇండి యా సంస్థ రూ.7 కోట్లతో ల్యాబ్‌ను, బజాజ్ ఆటో సంస్థ రూ.20 కోట్ల రోబోటిక్స్, ఆటోమేషన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి మరిన్ని కంపెనీలతో త్వరలో ఎంవో యూ చేసుకుంటామని తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా రూపుదిద్దామని స్పష్టం చేశారు. ఏటీసీ ద్వారా 4200 మందికి శిక్షణ కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఆటోమోబైల్ కేంద్రంగా..
హైదరాబాద్‌ను ఆటోమోబైల్ రంగంలోనూ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో ముందు కు సాగుతున్నామని మంత్రి తెలిపారు. దీంతోపాటు గాలి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌లో మార్పు తీసుకొచ్చే విధంగా కర్భన ఉద్గారాల నివారణ కోసం ఆర్ అండ్ డీ సెంటర్ అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే పెద్ద ఎత్తున ఉపాధి కల్పిందనే ఉద్దేశంతో ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. ఈ పాలసీలో భాగంగా కొత్తగా 10 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వీటిలో 5 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఉంటాయని స్పష్టం చేశారు. దీంతోపాటు మహిళలకు ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక పార్కు కేటాయిస్తామని, ఇన్నోవేషన్ హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా రూ.370 కోట్లను 84 వేల కార్మికులకు వివిధ పథకాల ద్వారా అందించామని తెలిపారు. 1.28 లక్షల మంది నిర్మాణ కార్మికులకు నైపుణ్యంపై శిక్షణ అందించామని పేర్కొన్నారు. 7,35,357 మంది కార్మికులకు రూ. 231 కోట్లతో హెల్త్ స్క్రీనింగ్ చేపట్టినట్టు స్పష్టం చేశారు.
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు యాక్సిండెటల్ డెత్ ఇన్స్యూరెన్స్ స్కీం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 13.51 లక్షల మందికి లబ్ధి చేకూరింద న్నారు. పదేళ్లపాటు క్రీడల పట్ల నిర్లక్ష్యం జరిగిందని, దానిని మార్చడంతోపాటు మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
వేలాది మందికి ఉపాది..
రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములయ్యే ందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు శ్రీధర్‌బాబు ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు. 1539 యూనిట్లకు టీజీ ద్వారా ఆమోదం తెలిపి దాదాపు రూ. 6,347.59 కోట్ల పెట్టుబడితో 35,724 మందికి ఉపాధి కల్పిం చామన్నారు. అదనంగా 791 యూనిట్లకు సంబంధించిన రూ. 9,240 కోట్ల తో 37,588 మందికి ఉపాధి కల్పించే కంపెనీల ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు.
వీటితోపాటు రాష్ట్రంలో రూ. 14,433 కోట్లతో 8894 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా 16 మెగా ప్రాజెక్టులకు కేబినెట్ సబ్ కమి టీ ద్వారా అనుమతి ఇచ్చామని తెలిపా రు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది కాలంలో 8,379 కోట్ల పెట్టుబడి అంచనాతో 368 కంపెనీలకు వివిధ పారిశ్రా మిక పార్కులో భూములు కేటాయించనున్నట్టు వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలోనూ అద్భుత రీతిలో అభివృద్ధి సాధించామన్నారు. ఫార్మా రంగానికి జీసీసీలను ఇక్కడికి తీసుకురావడంతో విజయం సాధించామని వెల్లడించారు.