16-07-2025 12:00:00 AM
కొత్తకోట / పెద్ద మందడి, జూలై 15 : పిల్లలకు బాల్యం నుంచే కంప్యూటర్ విద్య పై ప ట్టు సా ధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన కృత్రిమ మేధస్సు (ఎ ఐ) శిక్షణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించా రు. మంగళవారం ఉదయం కొత్తకోట మున్సిపాలిటీలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెద్దమందడి మండలంలోని మనిగిల్ల గ్రా మం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శిం చి 3-5వ తరగతి విద్యార్థులకు నేర్పిస్తున్న కృత్రిమ మేధస్సు శిక్షణ తరగతులను కలెక్టర్ తనిఖీ చేశారు.
కంప్యూటర్ పై విద్యార్థులు చేస్తున్న లెక్కల ను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో ఎన్ని పాఠశాలల్లో కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు? ఎన్ని కంప్యూటర్లు ఉన్నా యి?ఎంతమంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు అనే వివరాలను జిల్లా విద్యా అధికా రిని వివరాలు అడిగారు.ప్రభుత్వ ఉన్నత పా ఠశాల, ప్రాథమిక పాఠశాల ఒకే ప్రాంగణం లో ఉన్న 11 పాఠశాలల్లో 3-5 వ తరగతి వి ద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు డి. ఈ ఓ తెలిపారు.
అదేవిదంగా 6 నుంచి 12వ తరగతి కె .జి.బి.వి, మో డల్ స్కూల్ విద్యార్థులకు ఖాన్ అకాడమీ కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు.జిల్లా విద్యాశాఖ అధికారి మమ్మద్ అబ్దుల్ ఘని , కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, పెద్దమందడి తహసీల్దార్ సరస్వతి, సి.యం.ఓ మహానంది, తదితరులు ఉన్నారు.
లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునే విధంగా చూడాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, జూలై 15 : ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించా రు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్ లో హౌజింగ్ ఏ. ఈ లతో ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు.
మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించి పూర్తి చే సే విధంగా ఏ. ఈ లు లబ్దిదారులుకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఇల్లు నిర్మించుకునే విధంగా అవగాహన కల్పించాలని వారిని ఒప్పించి నిర్మాణం చేపట్టే విధంగా చూడాలన్నారు.
ఇప్పుడు మంజూరు పత్రం పొంది ఎంత చెప్పిన ఇళ్లు నిర్మించుకోవడానికి ఇష్టపడకుంటే వారి నుండి కారణాలతో సహా లిఖిత పూర్వకంగా రాయించుకోవాలని, వా రి పేర్లు రద్దు చేశాక ఇక భవిష్యత్తులోనూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాదన్నారు. ఇదే విషయాన్ని లబ్ధిదారులకు సైతం వివరించాలన్నారు. అదనపు కలెక్టర్ లోకల్ బా డీస్ ఇన్చార్జి యాదయ్య, పి.డి. హౌజింగ్ వి టోభ, ఎ. ఈ లు తదితరులు పాల్గొన్నారు.