calender_icon.png 21 January, 2026 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ కాలేజీ ఎదుట ఆందోళన

03-10-2024 01:04:19 AM

విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందని విద్యార్థి సంఘాల ఆరోపణ

శేరిలింగంపల్లి, అక్టోబర్ 2: మాదాపూర్‌లోని నారాయణ కాలేజీ సింధు క్యాంపస్‌లో ఇంటర్ విద్యార్థినిపై ఏసీ టెక్నీషియన్ లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బుధ వారం ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కాలేజీ ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

ఓ విద్యార్థినిపై లైంగికదాడి జరిగితే ఆ విషయం బయ టకు రాకుండా మేనేజ్ చేశారని, కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై గతంలోనూ లైంగిక దాడులు జరిగాయని, కానీ సిబ్బంది ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తున్నారని వారు ఆరోపించారు.

వెంటనే ఏసీ టెక్నీషియన్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం అలాంటి ఘటన చోటు చేసుకోలేదని చెబుతూనే ఏసీ టెక్నీషియన్‌ను కొట్టి పంపామని చెప్పడం గమనార్హం.