14 June, 2026 | 1:48 AM

మున్సిపల్ కాలనీలో తాగునీటిలో డ్రైనేజీ కలయికపై ఆందోళన

14-06-2026 12:00 AM

సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి

నాగోల్, జూన్ 13 (విజయక్రాంతి): చైతన్యపురి డివిజన్ పరిధిలోని మున్సిపల్ కాలనీలో తాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో బీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి వెంటనే స్పందించారు. కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించిన ఆయన, వాటర్ వరక్స్ డిపార్ట్మెంట్ డీజీఎం చందు నాయక్, సూపర్వైజర్ సురేందర్లతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించిన చంద్రశేఖర్ రెడ్డి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం వరకు పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహంకాళి గుడి మాజీ చైర్మన్ పురుషోత్తం, కాలనీ అధ్యక్షులు శ్రీహరి, మల్లేష్, నాయకులు జలంధర్, పులి కిరణ్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.