20-01-2026 12:00:00 AM
సికింద్రాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా మేడారం ప్రసాదం ఆన్‌లైన్ బుకింగ్ స్టిక్కర్లను జూబ్లీ బస్ స్టేషన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైద రాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్స్) శ్రీనివాస్, గ్రేట్ హైదరాబాద్ జోన్ లాజిస్టిక్స్ మొహమ్మద్ బిన్‌ఇషాక్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఇకపై ఆన్లైన్ tgsrtclogistics. co.in వ్బుసైట్ ద్వారా ప్రసాదాన్ని సులభంగా బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించామని, దీని వల్ల భక్తులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఆన్లైన్ బుకింగ్ విధానం వల్ల ప్రసాదం పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యం లో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం భక్తుల నుండి మంచి స్పందన పొందుతుందని, అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన స్టిక్కర్ల ద్వారా ఆన్లైన్ బుకింగ్ వివరాలు తెలుసుకొని భక్తులు సులభంగా సేవలను వినియో గించు కోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.