24-04-2025 01:35:38 AM
రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్
హనుమకొండ, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 27 మంది అమాయక ప్రజలు, ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్రంగా స్పందించిన భారతీయ జనతా పార్టీ, హసన్ పర్తి మండలంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, అమరులకు నివాళులు అర్పించే ఉద్దేశంతో మెయిన్ సెంటర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ ర్యాలీ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ లు హాజరై మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి మన దేశ భద్రతపై జరిగిన దారుణమైన దాడి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఇది చిన్నగానైనా మన నివాళి అన్నారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరుపల్లి రామచందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంటు కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, పెద్దమ్మ శ్రీనివాస్, తాళ్ల శ్యామ్, మేకల హరిశంకర్, మట్టెడు సుమన్, పలువురు పార్టీ నాయకులు, మండల కార్యకర్తలు, మహిళా మోర్చా, యువమోర్చా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.