calender_icon.png 10 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడమే ధ్యేయం

24-04-2025 01:35:54 AM

సీఎం ఆర్ ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

మంథని, ఏప్రిల్ 23(విజయ క్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని  సీఎం ఆర్ ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు అన్నారు. ఎలిగేడు మండలం బురహానిమియాపేట, సుల్తాన్ పూర్ గ్రామాలల్లో ఐకేపీ & సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి  ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన 24 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు (24,02,784/-) 24 లక్షల 2 వేల 784 రూపాయల విలువ గల చెక్కులను అలాగే 69 మంది లబ్దిదారులకు రూ. 20,27,50 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణి చేశారు. అంతకు ముందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదోవ తరగతిలో 10 జీపి సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు.  

సుల్తాన్ పూర్ గ్రామంలో..

ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్‌లో ప్రాధమిక ఉన్నత పాఠశాలలో మరియు ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా మరియు ఎ. ఎ. పి నిధులు, స్పెషల్ ఫండ్స్ ద్వారా నూతన వంట గది, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, ఇతర పనులకు రూ. 43 లక్షల రూపాయల నిధులతో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక నాయకు లతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 

కార్యక్రమంలో మండల తహసీల్దార్ బషీర్, ఎంపీడీఓ భాస్కర్ రావు, డీఈ దేవందర్, ఏఈ రవీందర్, ఏపీఎం సుధాకర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమా రాజశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచులు, అర్షణపల్లి వెంకటేశ్వర్ రావు, కొండా తిరుపతి గౌడ్, దుగ్యాల సంతోష్ రావు, గోపు విజయ భాస్కర్ రెడ్డి, థాంపర్తి వెంకీటేశ్వే ర్ రావు, బూర్ల సత్యనారాయణ, నరహరి సుధాకర్ రెడ్డి, పుల్ల రావు, పర్శరాములు, సంపత్ రావు, వెంకన్న, రాజిరెడ్డి, దేవరాజు, అమ్ముల రమేష్, , ఎంపీటీసీలు,  కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు  తదితరులు పాల్గొన్నారు.