10-02-2025 12:08:25 AM
కోదాడ ఫిబ్రవరి 9: వరంగల్ జిల్లా నర్సంపేట లో నిర్వహించిన నేషనల్ కరాటే ఛాంపియన్ పోటీలో అండర్ 15 కోదాడ పట్టణానికి చెందిన మాదవరపు శ్రేయాన్ గోల్ మెడల్ సాధించాడు. ఆదివారం శ్రేయాన్ ను ప్రముఖ న్యాయవాదులు మాధవరపు రామకృష్ణ, హనుమంతరాజు లతో పాటు పలువురు అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి కోదాడకు మంచి పేరు తేవాలని కోరారు.