10-02-2025 12:05:40 AM
తుంగతుర్తి, ఫిబ్రవరి 9: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన చింతకుంట్ల యాకయ్య40 తండ్రి సోమయ్య ప్రమాదవశాత్తు ఆదివారం సాయంత్రం తాడిచెట్టు పైనుండి పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు జరిగిన సంఘటనపై పోలీసులకు తెలియపరచగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ దావాఖానకు తరలించనున్నట్లు తెలిపారు. యాకయ్యకు భార్య ఒక కుమారుడు ఉన్నాడు. దీనితో రావులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.