calender_icon.png 23 November, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల బోనస్ డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం విఫలం

10-02-2025 12:15:49 AM

తుంగతుర్తి , ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ ప్రభుత్వం సన్న దాన్యానికి క్వింటాకు రూ. 500బోనస్ చెల్లిస్తామని చెప్పి ఐకెపి కేంద్రాల్లో కాంటాలు వేసి మిల్లులకు పంపారు.. దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తున్నప్పటికి 50 శాతం మందికి ఇప్పటి వరకు బోనస్ చెల్లించ లేదని మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

తుంగతుర్తి  పార్టీ కార్యాలయం లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణ మాఫీ. రైతు భరోసా. రేషన్ కార్డులు. ఇందిరమ్మ ఇండ్లు. ఆసరా పెన్షన్ లు.. మొదలగు సంక్షేమ. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం చెప్పేబుటకపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. పూర్తిగా ప్రభుత్వం పై నమ్మకం కోల్పోయారని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం రైతులు ప్రజలు చెప్పాలని ఆయన కోరారు