calender_icon.png 22 September, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ అష్టలక్ష్మి ఆలయం..

22-09-2025 12:50:35 PM

నేటి నుండే ప్రారంభం కానున్న దసరా నవరాత్రి ఉత్సవాలు..

కోరుట్ల (విజయక్రాంతి): కోరుట్ల పట్టణ ఆదర్శ్ నగర్ లో గల శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో 22-9-2025 నుండి 2-10-2025 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుటకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ నిర్వాహకులు బూరుగు రామస్వామి గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం గరుడ వాహనం, మంగళవారం ఆంజనేయ వాహనం, బుధవారం శేష వాహనం, గురువారం గజ వాహనం, శుక్రవారం సింహ వాహనం, శనివారం చంద్రప్రభ వాహనం, ఆదివారం సూర్యప్రభ వాహనం, 29-9-2025 సోమవారం హంస వాహనం, 30-9-2025 మంగళవారం చిలుక వాహనం, 1-10-2025 బుధవారం పొన్న చెట్టు వాహనం, 2-10-2025 గురువారం అశ్వ వాహనం.. కావున ఇట్టి దసరా ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరుగు రామస్వామితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు పెందుర్తి మధుసూదనా చారి అర్చక బృందం పాల్గొన్నారు.