21-09-2025 04:22:34 PM
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్..
చిట్యాల/టేకుమట్ల (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొంగలుగా మారి అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఇసుక అక్రమ రవాణాపై ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం టేకుమట్ల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా దొంగల రాజేందర్ హాజరై మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తానని చెప్పి, దోపిడీకి సహకరిస్తున్నట్టుగా కనపడుతుందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు టేకుమట్ల మండలంతో పాటు,రాష్ట్రమంతటా అక్రమ ఇసుక రవాణాతో వేల కోట్ల ప్రజా ధనం దోచుకున్నారని తెలిపారు.నేరెళ్లలో అడ్డుపడిన దళిత కుటుంబాలను రోజుల తరబడి చిత్ర హింసలు పెట్టిన నీచపు చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు.ఇప్పటికైనా అక్రమ ఇసుక దందాపై పోలీసు,రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో జిల్లా,రాష్ట్ర పార్టీ నాయకుల నేతృత్వంలో ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాజుల అజయ్,బండారి సమ్మయ్య,కూర సురేందర్ రెడ్డి,శ్రీపతి రవి, అంకల స్వామి,చాట్లకోళ్ల తిరుపతి,సంధ్య ప్రభాకర్,పంజాల కుమార్ గౌడ్ శక్తి,దేశెట్టి మహేందర్,చిలుక మహేందర్,దేశెట్టి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.