calender_icon.png 21 September, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు

21-09-2025 05:06:52 PM

జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య..

చిట్యాల (విజయక్రాంతి): అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బిజెపి పార్టీల నిరసన కార్యక్రమాలను చూస్తే నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓరలేకపోతున్నారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వలాభం కోసం పార్టీ మారి నియోజవర్గానికి ఎనలేని అన్యాయం చేశారన్నారు. ఐదేళ్ల పాలనలో శూన్యంగా పనిచేసే గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణ రావు గెలుపు పొంది, 18 గంటలు అహర్నిశలు కష్టపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని తెలిపారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం కలిసిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో సరిగోముల సది, గుర్రం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.