21-09-2025 06:01:33 PM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
చిట్యాల/మొగుళ్ళపల్లి (విజయక్రాంతి): నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ఆదివారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 69 మంది లబ్దిదారులకు రూ.16,50,000 సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద, నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్, టిపిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మండల అధ్యక్షుడు ఆకుతోట కుమార్, ఏఏంసి వైస్ చైర్మన్ రఫీ, సోసైటి చైర్మెన్ సంపెల్లి నరసింగరావు, జిల్లా నాయకుడు పోలినేని లింగరావు, తక్కల పల్లి రాజు, టౌన్ అధ్యక్షుడు క్యతరాజు రమేష్, నడిగోటి రాము తదితరులు పాల్గొన్నారు.