21-09-2025 05:42:14 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల డ్రైనేజీలోని నీరు రోడ్లపైకి చేరాయి. పట్టణంలోని తెలంగాణ చౌక్ లో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరి పూర్తిగా రోడ్డు మునిగిపోయింది. ప్రాంతమంతా డ్రైనేజీ దుర్వాసన వెదజల్లుతుందనీ, వర్షం పడిన ప్రతిసారి ఇదే దుస్థితి నెలకొంటుందని స్థానికులు వాపోయారు. డ్రైనేజీలను శుభ్రపరచి నీరు నిలవకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.