21-09-2025 05:04:51 PM
మానకొండూరు (విజయక్రాంతి): మైభారత్ కరీంనగర్, యువతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సదాశివపల్లి ఆధ్వర్యంలో మానకొండూరు మండలం, పోచంపల్లి ప్రైవేట్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్(Block Level Sports Meet)లో మొదటి రోజైన ఆదివారం జరిగిన క్రీడలు హోరాహోరీగా సాగాయి. మానకొండూర్ మండలంలోని గ్రామాలలో నుండి క్రీడాకారులు అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన అధికారి వెంకట రాంబాబు హాజరై శ్రీ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి పోటీలు ప్రారంభించారు. అథ్లెటిక్స్, షార్ట్ పుట్, బ్యాడ్మింటన్, చెస్, క్రీడా పోటీలకు, వాలీబాల్ 16 జట్లు, కబడ్డీ 7 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో మై భారత్ యువజన వాలంటరీ బుస రాకేష్, యువజన సంఘాల రాష్ట్ర నాయకులు తొర్తి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రాపాక ప్రవీణ్ ,పీఈటీ లు,క్రీడాకారులు,తదితరులు హాజరయ్యారు.