17-12-2025 10:07:08 PM
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు..
అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం..
సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు..
ఆళ్లపల్లి (విజయక్రాంతి): మండల వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మండల వ్యాప్తంగా 9314 ఓటర్లు ఉండగా పురుషులు 4641 మహిళలు 4673 ఉన్నారు. 8205 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో 88.09 శాతం ఓట్లు నమోదయ్యాయి. 12 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 8205 మంది ఇందులో పురుషులు 4142 మహిళలు 4063 ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో ఎన్నికలు నిర్వహించి మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం పట్ల పలు రాజకీయ పార్టీలు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
12 గ్రామ పంచాయతీల సర్పంచ్ ఫలితాల వివరాల్లోకి వెళితే...
ఆళ్లపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వాసం సుస్మిత, మర్కోడు కాంగ్రెస్ అభ్యర్థి సుతారి రమాదేవి, అనంతోగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్తి వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటాపురం సిపిఐ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వజ్జ ఉమా, పాతూరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈసం రుక్మిణి, రామంజిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోకాళ్ళ శేఖర్, రాఘవపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామనర్సయ్య, బొడాయికుంట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏడుల్ల శ్రావణి, నడిమిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం సంధ్య కుమారి, అడవిరామవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం సూర్యకాంతం, దొంగతోగు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బచ్చల పాపారావు, పలు పార్టీల సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలు రంగులు పూసుకుంటూ హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.