17-12-2025 09:48:39 PM
లక్నో: లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈరోజు జరగాల్సిన భారత్(India), దక్షిణాఫ్రికా(South Africa) జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా రద్దయింది. ఎకానా స్టేడియాన్ని పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో అంపైర్లు మొదటి పరిశీలనను సాయంత్రం 06:50 గంటలకు పరిశీలించారు. 07:30, 08:00, 08:30, 09:00 గంటలకు పొగమంచు పరిస్థితిని మరోసారి పరిశీలించారు. కానీ పరిస్థితులు మ్యాచ్‌కు అనుకూలంగా లేవని భావించారు. మ్యాచ్ జరగడం కష్టమని భావించి తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా, ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఎల్లుండి ఐదో టీ20 అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.