17-12-2025 10:32:46 PM
- మండలంలో 88.19 శాతం పోలింగ్
- ఇండిపెండెంట్ లదే హవా...
భీమారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం మండలంలో 11 గ్రామ పంచాయతీలకు, 68 వార్డులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. 11 జీపీలకు 46 మంది పోటీపడ్డారు. మండలంలో మొత్తం 94 వార్డులుండగా 23 వార్డులు ఏకగ్రీవం కాగా మూడు వార్డులకు నామినేషన్ లు రాలేదు. మిగితా 68 వార్డులకు 190 మంది పోటీపడ్డారు. మొత్తం 13,093 (6,394 పురుషులు, 6,699 మహిళలు) మంది ఓటర్లుండగా ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొమ్మిది గంటల వరకు 3,249 (24.81%), 11 గంటల వరకు 8,141 (62.18%), మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11,547 (88.19%) పోలింగ్ జరిగింది. 5,653 పురుషులు, 5,894 మంది మహిళలు ఓట్లు వేశారు. మండలంలో 88.19 శాతం పోలింగ్ జరిగింది. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి ఎన్నికల తీరును పరిశీలించారు.
సర్పంచులు వీరే...
మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరిగాయి. ఆరేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచుగా ఆకుదారి వీరయ్య (ఇండిపెండెంటు), భీమారం గ్రామ సర్పంచుగా ఉష్కమల్ల విజయలక్ష్మీ పున్నం చంద్ (ఇండిపెండెంటు), ఖాజిపల్లి సర్పంచుగా కొండ శ్యామల చందు (ఇండిపెండెంటు), కొత్తపల్లి సర్పంచుగా దుర్గం తిరుపతి (ఇండిపెండెంటు), ఎల్కేశ్వరం సర్పంచుగా పర్తిరెడ్డి సువర్ణ మహేశ్వర్ రెడ్డి (ఇండిపెండెంట్), బూర్గుపల్లి సర్పంచుగా మడె మల్లేష్ (కాంగ్రెస్), మద్దికల్ సర్పంచుగా పోతం సమ్మయ్య (కాంగ్రెస్), నర్సింగాపూర్(బీ) సర్పంచుగా పెద్దల రూప బాపు (కాంగ్రెస్), పోలంపల్లి సర్పంచుగా ప్రమీళ రమేష్ (కాంగ్రెస్), దాంపూర్ సర్పంచుగా చేగొండ కొమురయ్య (బీఆర్ఎస్), ధర్మారం గ్రామ సర్పంచుగా దాసరి మణిదీపక్ (బీఆర్ఎస్)లు ఎన్నికయ్యారు. 11 జీపీల్లో ఐదుగురు ఇండిపెండెంట్ లే విజయం సాధించారు. అలాగే నాలుగు కాంగ్రెస్, రెండు సర్పంచులను బీఆర్ఎస్ మద్దతు పొందిన అభ్యర్థులు గెలుపొందారు.