calender_icon.png 18 December, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల కాల్పులు

17-12-2025 11:05:29 PM

హైదరాబాద్: జగిత్యాల జిల్లా(Jagtial Districtవెల్గటూర్ మండలం పైడిపల్లి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఫలితం ప్రకటన అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. పైడిపల్లి సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని పట్టుబడ్డారు. కాగా, గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి, అనుచరులు ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఇరువర్గాలు గొడవకు దిగడంతో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘర్షణను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.