30-07-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: జులై 29 (విజయక్రాంతి): బతుకమ్మ చీరలు ఇచ్చి బతుకులు మార్చింది కాంగ్రెస్ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆంధ్ర నాయకులతో మీలాకాత్ అవుతూ కాంగ్రెస్ పార్టీ పై కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మండి పడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో మంగళవారం.
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.బిఆర్‌ఎస్ పార్టీ హ యంలో ఎస్సీల భూములను లాక్కుంది మీ నాయకులు కాదా అంటూ ప్రశ్నించారు. దొరల పాలనలో దొరలకే మేలు జరిగిందని ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టు ఇచ్చింది మీరు కాదా అం టూ మండి పడ్డారు.
ముఖ్యమంత్రిని ప్రశ్నించే స్థాయి ఆగయ్యకు లేదని. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.బిఆర్‌ఎస్ హయం లో ఇసుక అమ్ముకొని దోచుకుంది మీరు కదా అంటూ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కబ్జాకు గురై న భూములను వెలికి తీస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పైసలు ఇచ్చి బతుకులు మార్చాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హేచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు,గోనె ఎల్లప్ప, కత్తెర దేవదాస్,కల్లూరి చందన,నల్ల శ్రావణ్,గడ్డం కిరణ్, నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, కుడిక్యాల రవి, వేముల రవి, గుండ్లపల్లి గౌతమ్,భీమవరం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు