30-07-2025 12:04:33 AM
రాజన్న సిరిసిల్ల: జులై 29 (విజయక్రాంతి): వాతావరణ సమతుల్యత. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొ క్కలు నాటాలని వాటిని సంరక్షించాలని ప్ర భుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వన మహోత్సవాన్ని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల లో మంగళవారం నిర్వహించగా, ముఖ్య అ తిథులుగా ప్రభుత్వ విప్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై గోశాల ఆవరణలో క దంబ,ఇతర మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. అడవుల విస్తీర్ణం తగ్గుతుండడంతో వాతావరణ కాలు ష్యం పెరుగుతుందని, ఆక్సిజన్, పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించా రు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ తమ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాల ని సూచించారు. గ్రామాల్లో.. పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో పండ్ల, పూల మొక్కలు నాటాలని కోరారు.
మొక్కలు నాటేటప్పుడు స్తంభాల కింద, గోడల వద్ద పెట్టవద్దని సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయం, నియోజకవర్గం, పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. వేములవాడ ఆల యం, పట్టణ అభివృద్ధి పై సీఎం ప్రత్యేక దృ ష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. అలాగే తిప్పాపూర్ గోశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని వివరించారు.
రా ష్ట్రంలో నాలుగు అధునాతన పద్ధతిలో విశాలమైన గోశాలల నిర్మాణానికి సీఎం అధ్యక్ష తన కేబినెట్ ఆమోదించిందని గుర్తు చేశారు. వేములవాడ ఆలయానికి సంబంధించి కూ డా ఆధునాతన వసతులతో గోశాల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని దీనికి సం బంధించి స్థలం కూడా గుర్తించామని వెల్లడించారు.
వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ, ఇతర శాఖల ఆధ్వర్యంలో మొ క్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పౌరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొక్క లు నాటడంతో ప్రస్తుతంతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. కదంబ మొక్కలకు మొక్కలు దేవత మూర్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనవని వివరించారు.
ఐ.ఎస్.ఓ సర్టిఫికేషన్ కోసం కృషి: కలెక్టర్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గో శాలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. తిప్పాపూర్ గోశాల ఆవరణలో సివిల్ వరక్స్ కొనసాగుతున్నాయని వాటిని విప్ తో కలిసి పరిశీలించామని తెలిపారు. కోడెలకు పచ్చి గడ్డి సరఫరాలో ఇ బ్బంది కలగకుండా ప్రత్యేక ప్రణాళిక ప్రకా రం ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
మర్రిపల్లిలో 40 ఎకరాలు, నాంపల్లిలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో పచ్చి గడ్డి వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని వివరించారు. మూ డు నెలల్లో పచ్చి గడ్డి అందుబాటులోకి రా నుందని వెల్లడించారు. కోడెలకు అవసరమైన పచ్చిగడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని కాంట్రాక్టర్లపై ఆధారపడే ఇ బ్బంది ఉండదని ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధించామని స్పష్టం చేశారు. ఆ మేరకు డబ్బులు ఆదా అవుతాయని వెల్లడించారు.
గోశాలలో ఒక్కో సమస్య ప్రణాళిక ప్రకారం పరిష్కరిస్తున్నామని తెలిపారు. మొ రాదాబాద్ లోని గోశాలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వచ్చిందని గుర్తు చేశారు. తిప్పాపూర్ గోశాల కూడా ఐఎస్‌ఓ సర్టిఫికెట్ కోసం ప్ర యత్నాలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవా న్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి ఈవో రాధాబాయి మున్సిపల్ తదితరులు పాల్గొన్నారు.