30-07-2025 12:01:48 AM
ఖమ్మం, జులై 29(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగ మయి దయానంద్ హైదరాబాదులోనే ఓల్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంగళవారం కలిసి పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల, నియోజకవర్గం కమిటీ ల ని యామకం గురించి, భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా బాధ్యత లు అనంతరం భద్రాచలం ని యోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కమిటీ ల గురించి చర్చించినట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులుపాల్గొన్నారు.